Mohan Bhupathiraju's Blog !

వలపుల జడివానకో వైరాగ్యపు గొడుగు !

rsz_1164762_10150179391969325_3259532_n

వలపుల జడివానకో వైరాగ్యపు గొడుగు పట్టాను , నడక రాని పసి పాపలా పడుతూ లేస్తున్నాను.

కనులేమో కలువలైనవి, కాలమేమో జారుతున్నది….
నిన్నుగనే క్షణమెప్పుడో తెలియకున్నా, ముత్యపు చిప్పనై ‘స్వాతి చినుకు’కై ఎదురు చూస్తున్నా !

హితులను వదిలి, సన్నిహితులని విడిచి, అంతా నీవేనని మోజులో పడ్డాను….                                                                                               పయనం ఒంటరిదైనా నీ పై విశ్వాసమే తోడుగా అడుగులు వేస్తున్నాను.

ఏరుకుంటున్నాను జీవితం విసిరిన పాఠాలనే గులకరాళ్ళని, వాటినే సోపానంలా పేర్చి నిన్ను చేరాలని…….
అందివ్వరాదూ ఓ చెయ్యి, ఈ అట్టహాసం లేకుండా నిన్ను చేరడానికి…

ఒక్కొక్క అడుగే వేస్తున్నా, ఈ ‘అహం’ అంధకారాల నుండి ‘అహం – బ్రహ్మస్మి’ కోసం…                                                                                        అజ్ఞానపు సంకెళ్ళు తెంచి, వేకువ వెలుగులలోని అమృతత్వం కోసం….

కానిదేది సవాలు… అడుగెయ్యాలన్నా, అలోచించాలన్నా…చివరికి, అన్నీ వదలాలన్నా !

రానీ కోటి సవాళ్ళు, రానీ శతకోటి అశ్రువులు, రానీ సహస్రకోటి మరణాలు……
ఆగదు ఈ పయనం నిన్ను చేరే వరకు, నువ్వు నేనయ్యే వరకు, నువ్వో నేనో – ఒకరే మిగిలే వరకు, ఈ ద్వైతం పోయేవరకు…!!

 

Comments are closed.

Powered by WordPress | Designed by Elegant Themes