Mohan Bhupathiraju's Blog !

లలన అలల ఒంపులపై…

rsz_waves
ఈశా, వరమివ్వవూ..

నిశీధి శ్మశాన ఏకాంతంలో ప్రియ సఖిపై తీపి కలలుకనే నా శయనానికి,  ధైర్యాన్ని…..

కడలి లలన అలల ఒంపులపై నా అలపు మరచు ఆటలకు, నిశ్చలత్వాన్ని…..

నిర్జన నడి ఎడారిలో ఆ గుప్పెటి నీటినీ..నేల తల్లి దప్పికకై దానమిచ్చే, కరుణని…..

జనారణ్యపు ఆశల ఘోషలలో, హాయిల మాయలలో…’సత్య’పు ఊపిరి ఆగని, వైరాగ్యాన్ని…

క్షణమొక యుగమవ్వగ, నీ తాపంలో పరితపించే ఈ విరహ హృదయానికి, సహనాన్ని…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress | Designed by Elegant Themes